అర్జున్ సురవరం రివ్యూ

నటీనటులు : నిఖిల్ , లావణ్య త్రిపాఠి , వెన్నెల కిషోర్
సంగీతం : సామ్ సీఎస్
నిర్మాత : రాజ్ కుమార్
దర్శకత్వం : టి. సంతోష్
రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 29 నవంబర్ 2019

తమిళంలో ఘనవిజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో ” అర్జున్ సురవరం ” గా రీమేక్ అయ్యింది. నిఖిల్ – లావణ్య త్రిపాఠీ జంటగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ దర్శకత్వం వహించగా అన్ని అడ్డంకులు అధిగమించి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

కథ :

ఓ చిన్న ఛానల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న అర్జున్ సురవరం (నిఖిల్ ) కు బిబిసి ఛానల్ లో పనిచేయాలనే ఆసక్తి ఏర్పడుతుంది. బిబిసి లో ఛాన్స్ కొట్టెయ్యాలనే సంకల్పంతో ఉన్న సమయంలో అనుకోకుండా అర్జున్ ఓ కేసులో ఇరుక్కుంటాడు. ఫేక్ సర్టిఫికెట్లు చేసే ముఠాతో అర్జున్ సురవరం కు ఎందుకు విబేధాలు వచ్చాయి. అర్జున్ ఫేక్ సర్టిఫికెట్ ముఠాని ఎలా ఆటకట్టించాడు, ఆ కేసు ను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హైలెట్స్ :

నిఖిల్
కథ
కథనం
ట్విస్ట్ లు
నేపథ్య సంగీతం

డ్రాబ్యాక్స్ :

ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం

నటీనటుల ప్రతిభ :

అర్జున్ సురవరం పాత్రలో నిఖిల్ అద్భుత అభినయంతో ఆకట్టుకున్నాడు. జర్నలిస్ట్ పాత్రకు పూర్తిగా న్యాయం చేసాడు. ఒక్కో సినిమాకు తన నటనని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నాడు నిఖిల్. ఇక లావణ్య త్రిపాఠి కి కూడా మంచి పాత్ర లభించింది దాంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. లావణ్య ఈ చిత్రంలో మరింత అందంగా ఉంది అలాగే నిఖిల్ తో సరిజోడీ అనిపించుకుంది కూడా. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యింది. ఇక వెన్నెల కిషోర్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. విలన్ గా నటించిన తరుణ్ అరోరా కూడా మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో రాణించారు.

సాంకేతిక వర్గం :

తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. పాటలతో పాటుగా నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు. అలాగే సూర్య అందించిన ఛాయాగ్రహణం కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సంతోష్ విషయానికి వస్తే …… తమిళంలో కూడా సంతోష్ ఇదే మాతృక చిత్రానికి దర్శకత్వం వహించి ఉండటంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించి విజయం సాధించాడు. అయితే తెలుగుకి అనుగుణంగా మరిన్ని మార్పులు చేసి ఉంటే ఇంకా బాగుండేది.

ఓవరాల్ గా :

ఆకట్టుకునే సందేశాత్మక చిత్రం

REVIEW OVERVIEW
అర్జున్ సురవరం రివ్యూ
Previous articleAthade Srimannarayana Trailer Launch Photos
Next articleBigg Boss fame Ali Reza ropes in Rangamarthanda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here