జార్జి రెడ్డి రివ్యూ

జార్జి రెడ్డి రివ్యూ
నటీనటులు : సందీప్ మాధవ్ , ముస్కాన్ , సత్యదేవ్
సంగీతం :సురేష్ బొబ్బిలి
నిర్మాత : అప్పిరెడ్డి
దర్శకత్వం : జీవన్ రెడ్డి
విడుదల తేదీ : 22 నవంబర్ 2019
రేటింగ్ : 3/5

బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో ఉస్మానియా విద్యార్థి జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ” జార్జి రెడ్డి ”. దళం వంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన జీవన్ రెడ్డి తాజాగా జార్జి రెడ్డి తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ జార్జి రెడ్డి చిత్రంతో ప్రేక్షకులను అలరించేలా రూపొందించాడా ? లేదా ? అన్నది చూద్దామా !

స్టోరీ :

జార్జి రెడ్డి ( సందీప్ మాధవ్ ) కేరళలో పుట్టి పెరుగుతాడు. విద్యాభ్యాసం చెన్నై , బెంగుళూర్ లలో సాగుతుంది అయితే హైదరాబాద్ లోని యూనివర్సిటీ లో మాత్రం విద్యార్థి నాయకుడిగా ఎదుగుతాడు. లెఫ్ట్ భావాలతో చేగువేరా స్పూర్తితో అన్యాయాన్ని ఎదురించే క్రమంలో జార్జి రెడ్డి కి కొంతమంది శత్రువులౌతారు. ఆ శత్రు మూకల నుండి జార్జి రెడ్డి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? చివరకు అతడ్ని చంపింది ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సందీప్ మాధవ్ నటన
అభయ్
సెంటిమెంట్
యాక్షన్ సీన్స్
విజువల్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
స్లో నెరేషన్

పెర్ఫార్మెన్స్ :

జార్జి రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేం అంటే నమ్మండి అంత బాగా నటించాడు శాండీ. నడక , నడత , డైలాగ్ డెలివరీ , అప్పియరెన్స్ ఓవరాల్ గా జార్జి రెడ్డి ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగించాడు సందీప్. శాండీ అద్భుత అభినయం జార్జి రెడ్డి చిత్రానికి హైలెట్ అనే చెప్పాలి. జార్జి తల్లి పాత్రలో నటించిన దేవిక మెప్పించింది. ముస్కాన్ కు మంచి పాత్రే లభించింది దాంతో ఆ పాత్రని సద్వినియోగం చేసుకుంది ముస్కాన్. ఇక మిగిలిన పాత్రల్లో సత్యదేవ్ , చైతన్య కృష్ణ , మనోజ్ నందం , అభయ్ తదితరులు తమ పాత్రల్లో రాణించారు.

టెక్నికల్ టీమ్ :

సురేష్ బొబ్బిలి అందించిన పాటలు బాగున్నాయి అయితే పాటలకంటే నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే విజువల్స్ కూడా కట్టి పడేశాయి ఎందుకంటే ఈ సినిమా నేపథ్యం ఇప్పటిది కాదు 1972 కాలం నాటిది దాంతో ఆ అట్మాస్ఫియర్ ని కళ్ళముందు కదలడేలా చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ కి ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. ఇక దర్శకుడు జీవన్ రెడ్డి విషయానికి వస్తే …… జార్జి రెడ్డి ని అటెంప్ట్ చేసి మంచి ప్రయత్నమే చేసాడు. అలాగే అప్పటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించేలా జాగ్రత్త పడ్డాడు కూడా. అయితే సెకండాఫ్ లో కాస్త కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది. స్లో నెరేషన్ ప్రేక్షకులను కాస్త ఇబ్బందికి గురి చేసేలా ఉంది అలాగే సినిమా నిడివి కూడా.

ఫైనల్ గా :

యువతని మెప్పించే చిత్రం ఈ జార్జి రెడ్డి.

REVIEW OVERVIEW
జార్జి రెడ్డి రివ్యూ
Previous articleనాగ చైతన్య బర్త్డే సందర్భంగా చైతు లుక్ విడుదల
Next articleNaga Chaitanya NC19 First Look

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here